టీకా ప్రాప్తిరస్తు
Dr. ఎం.వి.రావు
‘కన్పల్డెంట్ ఫిజిషియన్, యశోదా హాస్పిటల్,సోమాజిగూడ, హైదరాబాద్
అద్భుతం… అద్వితీయం… అసామాన్యం! కొవిడ్-19 టీకాను వర్ణించటానికి ఇలాంటి పదాలు ఎన్నయినా సరిపోవు. దశాబ్దాలుగా పీడిస్తున్న ఇన్‌ఫెక్షన్లకే టీకాలు లేని రోజుల్లో ఇంత సత్వరం టీకా అందుబాటులోకి రావటమంటే మాటలా? మున్నెన్నడూ ఎరగని వైరన్ పుట్టుకురావటం, శరవేగంగా ప్రపంచాన్ని చుట్టబెట్టటం, అది మానవాళి మొత్తాన్ని దిగ్బంధించటం, దాన్ని మట్టబెట్టటానికి అంతే వేగంగా టీకాను రూపొందించటం… అంతా కేవలం ఏడాది కాలంలోనే జరగటమనేది అనూహ్యం. ప్రయోగాలు, ప్రయోగ పరీక్షలు, అత్యవసర వినియోగ దశలు దాటుకొని కొవిడ్-19 టీకా అందరికీ అందుబాటులోకి వచ్చిన శుభ
తరుణంలో మనందరి లక్ష్యం ఒకటే కావాలి. భయాలు, అపోహలు, అవాస్తవాలకు తావివ్వకుండా అందరమూ టీకా ధారులమే కావాలి. మన ఆరోగ్యమే పరమావధిగా అహోరాత్రాలు శ్రమించి, అనతికాలంలో టీకా కలను నిజం చేసిన శాస్త్రవేత్తల కృషికి నిజమైన ప్రయోజనం సిద్ధించేది అప్పుడే.
శరీరాన్ని మించిన టీకా ఫ్యాక్టరీ మరేదీ లేదు. తనను దెబ్బతీయాలని ప్రయత్నించే సూక్ష్మక్రిములను మట్టుబెట్టే సాధన సంపత్తిని సమకూర్చుకోవటం శరీరానికి పుట్టుకతో అబ్బిన విద్య. ఎప్పటికప్పుడు రోగనిరోధకశక్తిని ప్రేరేపించి, యాంటీబాడీలతో దాడికి దిగుతుంది. కొత్త క్రిములు విజృంభించినప్పుడే కాస్త తడబడుతుంటుంది. వాటిపై పైచేయి సాధించటానికి పోరాటం చేస్తున్నప్పటికీ కొన్నిసార్లు చేతులెత్తేస్తుంది. అలాగని పోరాటం ఆపదు. సరిగ్గా ఇక్కడే కొంత దన్ను అవసరం. టీకా అందించేది ఇలాంటి బలమే. కొవిడ్-.19ను అంతం చేయటానికి ఇప్పుడిదే వజ్రాయుధం కానుంది. వైరన్ వాహకం, నిర్వీర్య వైరన్, వైరస్ ఆర్‌ఎన్‌ఏ.. ఇలా ఎలాంటి పరిజ్ఞానంతో తయారైనవైనా అన్ని టీకాలు మన మేలు కోసం పుట్టకొచ్చినవే. సార్స్-కోవీ? మాదిరిగానే ఇవీ రోగనిరోధకశక్తిని ప్రేరేపిస్తాయి గానీ జబ్బును కలగజేయవు. కొవిడ్-19ను ఎదుర్కోవటానికి అవసరమైన యాంటీబాడీలు ఉత్సత్తయ్యేలా చేస్తాయి. ఎందుకనో గానీ టీకాలనగానే కొందరు తెగ బెంబేలెత్తిపోతుంటారు. తెలిసీ తెలియని వాళ్లు చెప్పినవే నిజమనుకొని లేనిపోని అపోహలు ‘పెంచుకుంటుంటారు. ఇది మంచిది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎంతోమంది కొవిడ్-18 టీకాలను తీసుకున్నారు. మనదేశంలోనూ ఆరంభించారు. ఎక్కడా, ఎవరికీ హాని జరగలేదు. కాబట్టి భయపడాల్సిన! పనిలేదు. సందేహాలను నివృత్తి చేసుకొని స్వచ్చందగానే ముందడుగు వేయాలి. ఎవరికివారే టీకా స్తాప్పిరస్తు అని దీవించుకోవాలి. ఇప్పటివరకూ స్తాణాలను అరచేతిలో పెట్టుకొని బతికిన రోజులకు మంగళం పాడాలి.
కొవిడ్-18 టీకా అందరూ తీసుకోవాలా?
కరోనా జబ్బు వచ్చినా, రాకున్నా అందరూ టీకా తీసుకోవాల్సిన అవసరముంది. ఇప్పటికే కొవిడ్-19 వచ్చినవారిలో సహజంగానే రోగనిరోధకశక్తి పుట్టుకొచ్చి ఉండొచ్చు. ఇది ఎంతకాలం రక్షణ ఇస్తుందనేది కచ్చితంగా తెలియదు. అధ్యయనాల్లో రకరకాల ఫలితాలు వెలువడుతున్నాయి. కొన్ని 4 నెలల వరకు, మరికొన్ని -8 నెలల వరకు రక్షణ ఉంటుందని పేర్కొంటున్నాయి. ఇది మళ్లీ ఇన్‌ఫెక్షన్ రాకుండా నివారిస్తుందా? లేకపోతే జబ్బు తీవ్రం కాకుండా చూస్తుందా? మరణాలను ఆపుతుందా? అనేవీ తెలియవు. కాబట్టి అంతా టీకా తీసుకోవటం మంచిది. టీకా తీసుకుంటే జబ్బు తలెత్తకుండానే కరోనా వైరన్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు పుట్టుకొస్తాయి. కొవిడ్-.19 వ్యాపించకుండా, జబ్బు తీవ్రం కాకుండా చూడటంలో సహజ, టీకా రోగనిరోధకశక్తి రెండూ కీలకమే.
టీకా తప్పనిసరా? తీసుకోకపోతే ఏమవుతుంది?
వైరన్ జన్యుపరంగా చాలా వేగంగా మార్సు చెందుతోంది. ఇలాంటి తరుణంలో ఎంత త్వరగా టీకా తీసుకుంటే అంత మంచిది. టీకా తీసుకోవటం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడినా తప్పకుండా తీసుకోవటమే ఉత్తమం. మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి సమస్యలు గలవారికిది మరింత ముఖ్యం. ఎందుకంటే ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి కొవిడ్ ముప్పు ఎక్కువ. తొలివిడతలో వైద్య సిబ్బంది… పోలీసులు, రెవెన్యూ, పురపాలక ఉద్యోగులు… ఆ తర్వాత 50 ఏళ్లు పైబడ్డవారికి.. మధుమేహం వంటి దీర్హకాలిక జబ్బులు గలవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మనం ఒక కొత్త వైరన్‌తో పోరాడుతున్నాం. దీంతో తలెత్తే ఇన్‌ఫెక్షన్‌కు కచ్చితమైన, ప్రామాణిక మందులేవీ లేవు. అన్నీ ప్రయోగాత్మకంగా, అనుభవంతో వాడుతున్నవే. అదృష్టం కొద్దీ కరోనా జబ్బులో మరణాల సంఖ్య తక్కువగానే ఉంటున్నప్పటికీ వీటిని సైతం ఆపాలన్నదే మన లక్ష్యం. ఇందుకు టీకా ఎంతగానో ఉపయోగపడుతుంది.
మద్యంతో టీకా దెబ్బతింటుందా?
అతిగా మద్యం తాగితే టీకాతో పుట్టుకొచ్చే రోగనిరోధక ప్రతిస్పందనలు తగ్గిపోవచ్చు. అందుకే రష్యా ప్రభుత్వం టీకా తొలి మోతాదు తీసుకోవటానికి ? రెండు వారాల ముందు నుంచే మద్యం మానెయ్యాలని సూచించింది. అలాగే రెండో మోతాదు తీసుకున్నాక 8 వారాల వరకూ దీని జోలికి వెళ్లొద్దని చెప్పింది.
ముందు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలా?
అవసరం లేదు. ఒకవేళ జలుబు, దగ్గు, జ్వరం వంటి కొవిడ్ అనుమానిత లక్షణాలుంటే మాత్రం పరీక్ష చేయించుకోవాలి. ఫలితం నెగెటివ్‌గా వచ్చినప్పటికీ లక్షణాలు తగ్గాకే టీకా తీసుకోవాలి.
కొవిడ్ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు తీసుకోవచ్చా?
కొవిడ్ ఇన్‌ఫెక్షన్ గలవారు, కొవిడ్ అనుమానిత లక్షణాలు గలవారు టీకా తీసుకోవటం వాయిదా వేసుకోవాలి. ఇన్‌ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకున్నాక 4-8 వారాల తర్వాతే టీకా తీసుకోవాలి. కొవిడ్‌కు మోనోక్షోనల్ యాంటీబాడీలు లేదా ష్షాస్మా చికిత్స తీసుకున్నవారికి, ఇతరత్తా ఏవైనా జబ్బులు తీవ్రమై ఆసుపత్రిలో చేరినవారికీ ఇదే వర్తిస్తుంది.
ఎన్ని మోతాదులు తీసుకోవాలి?
తం అందుబాటులో ఉన్న టీకాలను రెండు మోతాదుల్లో తీసుకోవాలి. ఒకటి తీసుకున్నాక 28 రోజులకు మరో మోతాదు తీసుకోవాలి. నిర్వీర్య వైరస్, బలహీన పరచిన వైరన్ భాగాలతో రూపొందించిన ఇవి సమర్థంగా పనిచేయాలంటే రెండు మోతాదులూ తీసుకోవాలి.
ఒక్కటే తీసుకుంటే ఏమవుతుంది?
ఒక మోతాదుతో 60-80% వరకు రక్షణ లభించొచ్చు. అదీ ఎక్కువ కాలం కొనసాగదు. అందువల్ల సంపూర్ణ రక్షణ లభించాలంటే రెండు మోతాదులు తప్పకుండా తీసుకోవాలి.
రెండోది తీసుకోవటం మరచిపోతే?
గాబరా పడాల్సిన పనిలేదు. వీలైనంత త్వరగా రెండో మోతాదు తీసుకోవాలి. మొదటి మోతాదు టీకాను మళ్లీ తీసుకోవాల్సిన అవసరం లేదు.
మందులపై ప్రభావముంటుందా?
మందుల మీద టీకా విపరీత ప్రభావమేమీ ఉండదు. కాకపోతే రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు, స్టిరాయిడ్డు వాడుతున్నవారిలో యాంటీబాడీలు అంతగా ఉత్సత్తి కాకపోవచ్చు.
అవయవ మార్చిడి చేయించుకున్నవారు తీసుకోవచ్చా?
అవయవ మార్సిడి చేయించుకున్నవారు రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు వాడుతుంటారు. కాబట్టి ప్రస్తుతానికి కరోనా టీకాను వీరికి సిఫారసు చేయటం లేదు. మున్ముందు అవసరమైతే నిపుణుల సలహా మేరకు, అదీ వైద్యుల పర్యవేక్షణలోనే ఇచ్చే అవకాశముంది.
వైరన్ మారినప్పుడల్లా మరో టీకా తీసుకోవాలా?
కరోనా వైరన్ అప్పుడప్పుడు జన్యుపరంగా మార్పులు చెందుతుండొచ్చు గానీ ఇది ఫ్లూ వైరన్ మాదిరిగా ‘మారుతున్నట్ట ఇప్పటివరకూ బయటపడలేదు. పైగా ఇలాంటి విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొనే టీకాలను రూపొందించారు. కరోనా వైరన్ మారినా టీకాలు పనిచేస్తాయి. బ్రిటన్‌లో బయటపడ్డ కొత్తరకం వైరన్ మీదా టీకాలు పనిచేస్తున్నట్ట వెల్లడైంది.
గర్భిణులు, పాలిచ్చే తల్లులు తీసుకోవచ్చా?
టీకా తయారీ సంస్థలు గర్భిణులపై ఇంకా ప్రయోగ పరీక్షలు చేయలేదు. వీరిపై టీకా ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు. అందుకే గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు కరోనా టీకా ఇవ్వద్దనే అమెరికా నీడీనీ చెబుతోంది. టీకా తీసుకున్నాక రెండు నెలల వరకు గర్భం ధరించొద్దని బ్రిటన్ ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలేవీ సజీవ వైరన్‌తో రూపొందించినవి కావు. కాబట్టి ఒకవేళ పొరపాటున తీసుకున్నా ఇబ్బంది ఉండకపోవచ్చు.
మధుమేహంతో బాధపడేవారు తీసుకోవచ్చా?
తీసుకోవచ్చు. నిజానికి మధుమేహం గలవారికి కరోనా వచ్చే అవకాశమే కాదు.. జబ్బు తీవ్రమయ్యే ముప్పు కూడా ఎక్కువే. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు తొలిదశలోనే టీకా తీసుకోవటం ఉత్తమం.
అన్ని టీకాల మోతాదులు సమానమేనా?
చాలావరకు సమానమే. అయితే వేర్వేరు వాహక వైరన్‌లతో రూపొందించిన స్ఫుత్నిక్-వి టీకా మోతాదులు వేరుగా ఉంటాయి. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రోజెనికా టీకాను మున్ముందు తొలిసారి సగం మోతాదులోనే ఇవ్వచ్చు.
పిల్లలకూ టీకా ఇప్పించాలా?
కరోనా టీకా ప్రయోగ పరీక్షలు 18 ఏళ్లు పైబడినవారికే నిర్వహించారు. అందువల్ల ప్రస్తుతానికి 18 ఏళ్లలోపు వారికి టీకాలు ఇవ్వకూడదనే నిర్ణయించారు. ఇటీవలే 12 ఏళ్లలోపు పిల్లలపై ప్రయోగ పరీక్షలు ఆరంభమయ్యాయి. వీటి ఫలితాలు వెలువడిన తర్వాతే పిల్లలకు, శిశువులకు టీకా అవసరమా? ఇస్తే ఎంత మోతాదులో ఇవ్వాలి? అనేది తేలుతుంది.
ఏ రకం టీకా తీసుకోవాలి?
అన్ని టీకాలు దాదాపు ఒకే సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాయి. అందువల్ల అందుబాటులో ఉన్న టీకా ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మనదేశంలో తయారైన టీకాలు మరింత అనువైనవని చెప్పుకోవచ్చు. వీటిని 2-8 డిగ్రీల సెల్షియన్ ఉష్ణోగ్రతలో భద్రపరిస్తే సరిపోతుంది. పైగా చవక. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలనైతే అతి శీతలమైన.., -0 డిగ్రీల సెల్షియన్ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇది మనదేశంలో కష్టం. ప్రస్తుతానికి ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు మనకు అందుబాటులోకి రాలేదు. మున్ముందు రావొచ్చు.
టీకా తీసుకున్నాక ఎన్నిరోజులకు రక్షణ లభిస్తుంది?
సాధారణంగా రెండో మోతాదు టీకా తీసుకున్న ? వారాల తర్వాత అత్యుత్తమ రక్షణ మొదలవుతుంది. జబ్బు తీవ్రం కావటం ‘0-800% వరకు తగ్గుతుంది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం నూటికి నూరు శాతం తగ్గుతుంది. టీకా తక్షణ లక్ష్యం కూడా ఆసుపత్రిలో చేరటాన్ని మరణాలను నివారించటమే.
టీకా తీసుకుంటే మాస్కుతో పనిలేదా?
టీకా తీసుకున్న 2 వారాల తర్వాత యాంటీబాడీలు ఉత్సత్తి కావటం మొదలవుతుంది. అప్పటివరకూ మిగతావాళ్లతో సమానమేనని తెలుసుకోవాలి. పైగా టీకా నూటికి నూరు శాతం రక్షణ ఇవ్వలేదు. ఆయా టీకాల సామర్భ్యాలు వేర్వేరుగా ఉంటున్నాయి. కొన్ని 90%, కొన్ని 85%, కొన్ని 80% రక్షణ ఇస్తున్నట్టు తేలింది. అంటే నూటికి 5-20% మందిలో టీకాలు పనిచేయటం లేదనే అర్థం. వీరికి మిగతా వాళ్ల మాదిరిగానే వైరన్ సోకే ముప్పు పొంచి ఉంటుంది. టీకా రక్షణ మొదలైనవారిలోనూ అది వారికి ఇన్‌ఫెక్షన్ కలగజేయకపోవచ్చు గానీ వారి నుంచి ఇతరులకు వైరన్ వ్యాపించకూడదనేమీ లేదు. కాబట్టి మాస్కు ధరించటం, ఇతరులకు దూరంగా ఉండటం, సబ్బుతో చేతులు కడుక్కోవటం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. ఎక్కువమందికి టీకాలు ఇచ్చేంతవరకు, సామూహిక రోగనిరోధకశక్తి సంతరించుకునేంతవరకు ఇలాంటి జాగ్రత్తలను ఎప్పటిలా పాటించాల్సిందే.
‘దుష్త్రుభావాలేవైనా ఉంటాయా?
ప్రయోగ పరీక్షల్లో పాల్గొన్న చాలామందిలో జ్వరం, నిస్సత్తువ వంటి కొవిడ్ లక్షణాలే కనిపించాయి. ఎందుకంటే టీకా కూడా నిజం కరోనా వైరన్ మాదిరిగానే లక్షణాలను ప్రేరేపిస్తుంది. ఇది టీకా ప్రభావం చూపుతోందనటానికి నిదర్శనమే. టీకా ఇచ్చిన చోట నొప్పి, బొప్పి వంటివీ కనిపించాయి. కొందరిలో వెన్నుపాము పొర వాపు, ముఖ పక్షవాతం తలెత్తినట్టు వినిపించింది గానీ అవేవీ టీకాకు సంబంధించినవి కావని తేలింది. కరోనా టీకాను అతి తక్కువ సమయంలో రూపొందించిన మాట నిజమే అయినా పరీక్ష పద్ధతులు, విధి విధానాల్లో ఎక్కడా రాజీ పడలేదనే సంగతిని గుర్తించాలి. గత దశాబ్దకాలంగా శాస్త్రరంగం ప్రసాదించిన అధునాతన పరిజ్ఞానాలే సత్వర టీకా రూపకల్పనకు పునాది వేశాయని తెలుసుకోవాలి. టీకా కూడా మందులాంటిదే కాబట్టి దీంతో కొందరికి అలర్జీ రావొచ్చు. ఇది వైరన్, వైరన్ భాగాలతో తలెత్తుందని అనుకోవటానికీ లేదు. టీకా చెడిపోకుండా ఉండటానికి వాడే పదార్థాలూ కొన్నిసార్లు అలర్జీ తెచ్చి పెట్టొచ్చు. ఏవైనా దుష్ప్రభావాలు తలెత్తితే వెంటనే చికిత్స చేయటానికి అవసరమైన సదుపాయాలన్నీ అందుబాటులో ఉంచుకునే టీకా వేస్తారు. అందుకే టీకా తీసుకున్న తర్వాత కనీసం అరగంట సేపు అక్కడే ఉండాలి. ఏవైనా మందులు పడనివారు… అలర్జీలు, రక్తం గడ్డకట్టటంలో లోపాల
వంటి సమస్యలు గలవారు ముందుగానే ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.
టీకా రక్షణ ఎంతకాలం?
కొత్త కరోనా వైరస్‌ను మనం ఇంతకుముందెన్నడూ ఎదుర్కోలేదు. టీకా తయారీ పరిజ్ఞానమూ కొత్తదే. అందువల్ల ఎంతకాలం రక్షణ లభిస్తుందన్నది ఇప్పుడే చెప్పలేం. టీకా తయారీ సంస్థలు ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు రక్షణ కల్సిస్తాయని చెబుతున్నాయి. టీకా తీసుకున్నవారిని క్రమం తప్పకుండా పరిశీలించిన తర్వాతే ఎంతకాలం వరకు యాంటీబాడీలు ఉంటున్నాయన్నది బయటపడుతుంది. బూస్టర్ టీకాలు అవసరమా? అయితే ఎప్పుడు ఇవ్వాలి? అనేది నిర్ణయించటం సాధ్యమవుతుంది.