బూస్టర్‌ తోడుగా … టీకాలు పాతవే అయినా…

బూస్టర్‌ తోడుగా … టీకాలు పాతవే అయినా…

Dr. ఎం.వి.రావు
‘కన్పల్డెంట్‌ ఫిజిషియన్‌, యశోదా హాస్పిటల్‌,సోమాజిగూడ, హైదరాబాద్‌ 

కోవిడ్-19 నియంత్రణలో టీకాల ప్రాధాన్యం ఎనలేనిది. అనతికాలంలోనే రూపుదిద్దుకొని అందరికి అందుబాటులోకి రావటం ఒక ఎత్తయితే… వీటిని తీసుకున్నవారికి జబ్బు తీవ్రం తాతపోవటం, జబ్బు వచ్చినా త్వరగా తగ్గటం మరో విశేషం. కాకపోతే టీకాలతో పుట్టుకొచ్చిన యాంటీబాడీలు 6-9 నెలల్లోనే తగ్గిపోవటమే కలవరం కలిగిస్తోంది. మరెలా? అని మధనపడుతున్న తరుణంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త (ప్రికాషనరీ) మోతాదుకు అనుమతించటం కొత్త భరోసా కల్పించింది. బూస్టర్‌ మోతాదుగా భావిస్తున్న ఇది కొవిడ్‌ మహమ్మారిని తుదముట్టించేందుకు కొత్త ఆయుధంగా తోడ్పడుతుందనటం నిస్సందేహం. ఇతర దేశాల అనుభవాలు చెబుతున్న సత్యమిదే.

సుదూర పందెంలో పరుగెడుతున్నారు. మధ్యలో కాస్త ఆయాసంగా అనిపించింది. కొద్దిగా వేగం తగ్గింది. అంతలో పక్కనుంచి ఎవరో నీళ్ల సీసా అందించారు. ఒక్క గుటక తాగగానే ప్రాణం లేచి వచ్చింది. వేగం తిరిగి పుంజుకుంది. కొవిడ్‌ జబ్బును ఎదుర్కోవటంలో మనం ఇలాంటి స్థితిలోనే ఉన్నాం. రెండేళ్లుగా సుదీర్జంగా పోరాడుతూనే వస్తున్నాం.టీకాల తోడ్పాటుతో ముందుకు దూసుకుపోతున్నాం. ఇప్పుడు బూస్టర్‌ టీకాతో మరింత బలం సంతరించుకోబోతున్నాం. ఇప్పటికే రెండు టీకాలు తీసుకున్నాం కదా. మరి ఇంకో మోతాదు ఎందుకనే అనుమానం రావొచ్చు. టీకాల బలం క్షీణిస్తున్న సమయంలో మరింత అదనపు శక్తిని సంతరించుకోవటానికిది ఎంతగానో తోడ్పడుతుంది. బూస్టర్‌ టీకా ఉద్దేశమూ ఇదే. సాధారణంగా టీకా తీసుకున్నప్పుడు వ్యాధి కారకాన్ని (యాంటీజెన్‌) ఎదుర్కోవటానికి మన రోగనిరోధక వ్యవస్థ యాంటీబుడీలను పుట్టిస్తుంది. ఇవి వైరస్‌, బ్యాక్టీరియా వంటి వాటి మీద నేరుగా దాడి చేసి నిర్మూలిస్తాయి. అయితే టీకాలన్నీ ఒకటి కావు. కొన్ని టీకాల ప్రభావం కొద్ది నెలలే ఉండొచ్చు. కొన్ని కొన్నేళ్ల పాటు పనిచేయొచ్చు. కొన్ని జీవితాంతం ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు హెపటైటిస్‌ బి టీకా ఒకసారి తీసుకుంటే చాలు. జీవితాంతం రక్షణ కల్పిస్తుంది. అదే టెటనస్‌ (టీటీ) టీకా పదేళ్లు మాత్రమే పనిచేస్తుంది. తర్వాత దీని ప్రభావం తగ్గుతూ వస్తుంది. అందుకే మళ్లీ అదనపు టీకా, తీసుకోవాల్సి వస్తుంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ దీన్ని ఎదుర్కోవటానికి యథాస్థితికి వస్తుంది. పోలియో, రేబిస్‌ వంటి జబ్బులకూ ఇలా బూస్టర్‌ టీకాలు ఇవ్వటం చూస్తూనే ఉన్నాం. కొవిడ్‌-19 ముందుజాగ్రత్త టీకా కూడా ఇలాంటిదే.

బూస్టర్‌ అవసరమా?

ఎలాంటి జబ్బులూ లేని ఆరోగ్యవంతులకు కొవిడ్‌ ‘టీకాలతో మంచి రోగనిరోధక శక్తి లభిస్తుంది. అదే రోగనిరోధకశక్తి తక్కువగా. ఉండే వృద్చలకు, స్టిరాయిడ్‌ మందులు వాడేవారికి, క్యాన్సర్‌ చికిత్సలు, తీసుకునేవారికి టీకా ఇచ్చినా యాంటీబాడీలు అంతగా పుట్టకరావు. ఇలాంటివారికి అదనపు మోతాదులు అవసరం. అందుకే చాలాదేశాల్లో ఇప్పటికే కొవిడ్‌ బూస్టర్‌ టీకాలు ఇవ్వటం మొదలెట్టారు. నిజానికి రెండో మోతాదునే ఒకరకంగా బూస్టర్‌ టీకా అనుకోవచ్చు. ఓక మోతాదుతో పూర్తి రక్షణ లభించకపోవటం వల్లనే రెండో మోతాదు తీసుకోవాలని సిఫారసు చేశారు. దీని ప్రభావం కూడా ఎక్కువ కాలం ఉండకపోవటం మూలంగానే మూడో మోతాదు ఇవ్వటం మీద దృష్టి సారించారు. కొవిడ్‌ టీకాలతో పుట్టుకొచ్చిన యాంటీబాడీల సంఖ్య వేగంగా క్షీణిస్తూ వస్తోంది మరి. కొవిడ్‌ కారక వైరస్‌ను రోగనిరోధక వ్యవస్థ గుర్తుపెట్టుకునే సామర్ధ్యమూ తగ్గుతోంది. చాలామందిలో… ముఖ్యంగా వృద్వల్లో ఇలాంటి ధోరణి ప్రస్పుటంగా కనిపిస్తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు కొవిడ్‌ వైరస్‌ రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటోంది. వేగంగా కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయి. ఇవి టీకాల ప్రభావాన్ని తట్టుకునే

విధంగానూ మారిపోతున్నాయి. బూస్టర్‌ టీకాల అవసరం రోజురోజుకీ పెరుగుతోంది. అ మాటకొస్తే కొవిడ్‌ టీకాల రక్షణ ప్రభావం రెండో దశలోనే బయటపడింది. మనదేశంలో మొదట్లో ముందుగా ఆరోగ్య సిబ్బందికి కొవిడ్‌ టీకాలు ఇవ్వటం తెలిసిందే. డెల్టా రకం వైరస్‌ విజ్బంభించినప్పుడు డాక్టర్ను, ‘నర్చుల్లో చాలా తక్కువ మంది దీని బారినపడటం చూశాం. దీనికి కారణం సహజ ఇన్‌ పెళ్టన్‌తో పాటు టీకాలతో పుట్టుకొచ్చిన రోగనిరోధకళక్తే. బూస్టర్‌ టీకాల ప్రాధాన్యమేంటో ఇది చెప్పకనే చెబుతోంది.

ఇతర దేశాల అనుభవాలతో

ఇజ్రాయెల్‌, అమెరికా బ్రిటన్‌ వంటి దేశాల్లో ఇప్పటికే బూస్టర్‌ టీకాలు ఇవ్వటం ఆరంభించారు. వీటిని తీసుకున్నవారిలో కొత్తగా ఇన్‌ఫెక్షన్‌  రావటం, ఇన్‌ఫెక్షన్‌ తిరగబెట్టటం, ఇన్‌ పెళ్లన్‌తో తలెత్తే దుష్ప్రభావాలు తలెత్తటం తక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం విజృంభిస్తున్న ఒమిక్రాన్‌ రకం వైరస్‌ సోకినవారిలో చాలామందికి పెద్దగా లక్షణాలు ఉండటం లేదన్నది నిజమే అయినా అసలే టీకాలు తీసుకోనివారిలో సమస్య తీవ్రంగా మారుతోంది. టీకాలు తీసుకోనివారికి, తీసుకున్న వారికి… ఒక మోతాడు తీసుకున్నవారికి, రెండు మోతాదులు తీసుకున్నవారికి… అలాగే రెండు మోతాదులు తీసుకున్నవారికి, అదనంగా బూస్టర్‌ టీకా తీసుకున్నవారికి మధ్య తేడా చాలా ప్రస్పుటంగానే కనిపిస్తోంది.

ఎవరికి ఇస్తారు?

రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే అరవై ఏళ్లు ‘పైబడ్డవారికి. అలాగే వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశద్ద్ధ్య కార్మికుల వంటి వారికి ముందుగా బూస్టర్‌ టీకాలు ఇవ్వనున్నారు. రెండో టీకా తీసుకున్న 9 నెలల (19వారాలు) తర్వాత బూస్టర్‌ మోతాదు తీసుకోవాలని,

ప్రభుత్వం చెబుతోంది. కానీ 6 నెలల తర్వాత తీసుకోవటమే మంచిది. ఇతర దేశాల్లో ఈ విధానాన్నే పాటిస్తున్నారు.ఎందుకంటే టీకా తీసున్నాక పుట్టుకొచ్చిన యాంటీబాడీలు 6 నెలల వరకే ఉంటున్నాయని, అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి ఆర్నెల్ల తర్వాత తీసుకుంటే ‘టీకా మరింత సమర్దంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు.

బూస్టర్‌గా ఏ టీకా?

బూస్టర్‌ మోతాదుగా ఏ టీకా ఇవ్వాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వేరే టీకా తీసుకున్నా ఇబ్బందేమీ ఉండదు. నిజానికి వేరే టీకా వేసుకుంటే (ఉదా. కొవిషీల్డ్‌ తీసుకున్నవారు కొవాక్సిన్ వేసుకోవటం) మంచిదన్నది శాస్త్రవేత్తల భావన. అయితే వేరే టీకాలు తీసుకోవటం ఎంతవరకు సురక్షితం? ఏవైనా దుష్ప్రభావాలుంటాయా? అనే దానిపై మనదగ్గర ప్రస్తుతానికి అంత  సమాచారం లేదు ప్రస్తతం మనదగ్గర ఒక వైద్య సంస్థలో చేపట్టిన ప్రయోగ పరీక్ష ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సీ ఉంది. కొవిషీల్డ్‌ వేసుకున్నవారు కొవాక్సిన్, కొవాక్సిన్ వేసుకున్నవారు కొవిషీల్డ్‌ తీసుకోవటం సురక్షితమేనని, దీంతో వైరస్‌ రకాలకు మరింత

రక్షణ లభిస్తున్నట్టు భారత వైద్య పరిశోధన మండలి అధ్వర్యంలో పనిచేసే నేషనల్‌ ఇన్‌స్టెట్యూట్‌ ఆప్‌ వైరాలజీ నిర్వహించిన అధ్యయనం సూచిస్తోంది.

  • టీకా మోతాదు విషయంలోనైతే ఎలాంటి మార్చు లేదు. కాకపోతే స్పుత్నిక్‌ విషయంలో తక్కువ మోతాదుతో కూడిన లైట్‌ టీకాను ‘బూస్టర్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. అ లసలే టీకాలు తీసుకోనివారిలో చాలామందికి సమస్య విషమిస్తోంది. అత్యవసర చికిత్స విభాగంలో చేర్చి, ఆక్సిజన్‌ ఇవ్వాల్స్‌ వస్తోంది. కొందరు చనిపోతున్నారు కూడా.
  • 5 మోతాదు తీసుకున్నవారిలో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా వస్తోంది. వీరికి ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఏర్పడుతోంది. బయటి నుంచి ఆక్సిజన్‌ ఇవ్వాల్సి వస్తోంది.
  • రె0డు మోతాదులు తీసుకున్నవారిలో చాలామందికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం తప్పుతోంది బయటి నుంచి ఆక్సిజన్‌ ఇవ్వాల్సిన అవసరం ఉండటం లేడు. మరణాలూ సంభవించటం లేదు.
  • అదే బూస్టర్‌ టీకా తీసుకున్నవారు కొవిడ్‌ బారినపడ్డా చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించటం లేదు. ఒకవేళ లక్షణాలు కనిపించినా ఒక మాదిరిగానే ఉంటున్నాయి. మామూలు జలుబు మాదిరిగానే ఉంటోంది. ఒకప్పటిలా తీవ్రం కావటం లేదు.

– ఇవన్నీ బూస్టర్‌ టీకా ప్రయోజనాలను గట్టిగా నొక్కి చెబుతున్నాయి. కాబట్టీ ఇది మనకూ ఉపయోగకరమే.

కొవిడ్‌-19 ఆరంభంలో టీకాలు రూపొందించారు. వైరస్‌ ముల్లు ప్రొటీన్‌లో తలెత్తాయి కదా. మరి ఆ టీకాలు ‘బూస్టర్‌గా పనిచేస్తాయా? అన్నది చాలామంది సందేహం. వైరస్‌లో ఒక్క ముల్లు (ఎస్‌) ప్రొటీనే కాదు, ఇతరత్రా ప్రొటీన్లు చాలానే ఉంటాయి.

ఎన్వలప్‌ (ఇ) ప్రొటీన్‌, మెంట్రేన్‌ (ఎం) ప్రొటీన్‌, ఓపెన్‌ రీడింగ్‌ (ఫ్రేమ్‌ (ఓఆర్‌ఎఫ్‌) ప్రొటీన్‌, న్యూక్లియోక్యాప్సిడ్‌ (ఎన్‌) ప్రొటీన్‌… ఇలా రకరకాల ‘ప్రొటీన్న ఉంటాయి. వీటిన్నింటికీ టీకాతో రోగనిరోధశక్తి పుట్టుకొస్తుంది. వైరస్‌ను నిర్వీర్యం చేసి వాటి భాగాలతో

తయారుచేసిన టీకాలు సమర్ధంగా పనిచేస్తాయి. ముల్లు ప్రొటీన్‌లోనూ ఎన్నో రకాల అమైనో ఆమ్లాలుంటాయి. వీటిల్లో కొన్ని

మారినా మిగతావి అలాగే ఉంటాయి. టీకా వీటి మీద కూడా పనిచేస్తుంది. కాబట్టి వైరస్‌ ముల్లు ప్రొటీన్‌లో మార్పులు తలెత్తినంత మాత్రాన టీకాలు పనిచేయవని అనుకోవద్దు.

 కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాల్సిందే

బూస్టర్‌ తీసుకున్న తర్వాతా ఇన్‌ఫెక్టన్‌ కూడదనేమీ లేదు. అయితే ఇన్‌ఫెక్టన్‌ వచ్చినా తీవ్రం కాకపోవచ్చు. చాలామందిలో లక్షణాలే కనిపించకపోవచ్చు. ఒకవేళ లక్షణాలు తలెత్తినా   తక్కువ స్థాయిలోనే ఉంటాయి. ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రంగా జబ్బు మారదు. ‘దాదాపు మరణాలు ఉండవనే చెప్పుకోవచ్చు.  అలాగని విచ్చలవిడిగా ప్రవర్తించటం తగదు. బూస్టర్‌ తీసుకున్నవారిలో లక్షణాలు ‘తలెత్తకపోయినా వారి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాపించొచ్చు. కాబట్టి మాస్కు ధరించటం, ఇతరులకు దూరంగా ఉండటం, చేతులు సబ్బుతో కడుక్కోవటం వంటి జాగ్రత్తలు పాటించాల్సిందే.

అపోహలు వద్దు

అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులున్నా… ఇతరత్రా మందులు వాడుతున్నా బూస్టర్‌ టీకా నిరభ్యంతరంగా ‘త్రీసుకోవచ్చు. మందులు ఆపేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ జలుబు, దగ్గు వంటి కొవిడ్‌ లక్షణాలుంటే అవి తగ్గిన రెండు వారాల తర్వాత టీకా తీసుకోవాలి. రెండు టీకాలు తీసుకున్నా కొవిడ్‌ వచ్చి, తగ్గినవారూ నెల తర్వాత టీకా వేసుకోవచ్చు. పొగ, మద్యం అలవాట్లతో రోగనిరోధకశక్తి బలహీనమవుతుంది కాబట్టి టీకా తీసుకున్నాక రెండు వారాల వరకు వీటి జోలికి వెళ్లొద్దు.

అటు కరోనా ఇటు డెంగీ

అటు కరోనా ఇటు డెంగీ

Dr. ఎం.వి.రావు
‘కన్పల్డెంట్‌ ఫిజిషియన్‌, యశోదా హాస్పిటల్‌,సోమాజిగూడ, హైదరాబాద్‌ 

కొవిడ్‌.. కొవిడ్‌.. కొవిడ్‌. గత 18 నెలల నుంచీ అందరి నోటా ఇదే మాట. అదేంటో గానీ ఈ ఏడాదిన్నరలో కొవిడ్‌-19 తప్ప ఇతరత్రాఇన్‌ పెక్షన్లేవీ అంతగా కనిపించలేదు. ఆసుపత్రుల్లో చేరినవారిలో నూటికి 99% మంది కరోనా బాధితులే. ఒకప్పటిలా డెంగీ, మలేరియా, వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్‌ వంటివి విజ్బంభించలేదు. చేతుల శుభ్రత, బయటకు అంతగా రాకపోవటం, మాస్కులు ధరించటం, ఇంటి ఆహారమే తినటం, పరిసరాల్లో దోమలు పెరగకుండా చూసుకోవటం వంటి జాగ్రత్తలు దీనికి కారణం కావొచ్చు. అయితే ఇటీవల కొవిడ్‌ రెండో దశ తగ్గుముఖం పట్టే సమయంలో డెంగీ జ్వరాలు

పెరుగుతుండటం కలవరం కలిగిస్తోంది. కొవిడ్‌-19,డెంగీ రెండింటిలోనూ తొలిదశలో దగ్గు తప్ప జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలన్నీ ఒకేలా ఉంటాయి. కొందరిలో ఒకేసారి డెంగీ, కొవిడ్‌-19 రెండూ కలిసి ఉంటున్నాయి కూడా. డెంగీ ఒక్కటే కాదు.

వర్షాకాలంలో విజ్శంభించే మామూలు ప్లూ, మలేరియాస్రబ్‌ టైపస్‌, లెష్టోస్పైరోసిస్‌ వంటివీ దాడిచేస్తున్నాయి.  వీటిల్లోనూ జ్వరం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు తలెత్తుతుంటాయి. జ్వరం అనగానే కొవిడే అని బయపడిపోతున్న రోజుల్లో వీటి తారతమ్యాలను గుర్తించి, మసలు కోవటం ఎంతైనా అవసరం.

డెంగీనా? కొవిడా?

ప్రస్తుతం కొవిడ్‌-19 తో పాటు అందరినీ ఎక్కువగా భయ పెడుతోంది డెంగీనే. దీనికి మూలం డెంగీ వైరస్‌లు. ఈడిస్‌ జాతి దోమలు కుట్టటం ద్వారా వ్యాపిస్తుంది. ఇక కొవిడ్‌-19కు మూలం సార్స్‌-కొవీ-2 వైరస్‌. దగ్గినప్పుడుతుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. తీవ్రతను బట్టి వీటి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. 

 ఒక మాదిరి నుంచి మధ్యస్థ డెంగీలో- జ్వరం, కళ్ల వెనక నొప్పి,తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నడుం నొప్పి, వాంతి, వికారం, దద్దు,తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్‌ కణాలు పడిపోవటం కనిపిస్తాయి. తీవ్రమవృతున్నకొద్దీ- చర్మం మీద దద్దు, కడుపు నొప్పి, విడవకుండా వాంతులు, పొట్టలో నీరు చేరటం, నిస్సత్తువ, చిరాకు, కాలేయం పెద్దగా అవ్వటం తలెత్తుతుంటాయి. తీవ్ర దశలో- రక్తనాళాల్లోంచి ష్లాస్మా లీకవుతుంటుంది. దీంతో రక్తం చిక్కబడుతుంది. ఇది షాక్‌కు దారితీస్తుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. ప్లేట్‌లెట్లు బాగా పడిపోవటం వల్ల రక్తస్రావం కూడా కావొచ్చు. క్రమంగా కాలేయం, గుండె వంటి అవయవాల పనితీరు ఆస్తవ్యస్తమవుతుంది. 

 ఒక మాదిరి నుంచి మధ్యస్థ కొవిడ్‌-19లో- జ్వరం లేదా వణుకు, దగ్గు,శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, నిస్సత్తువ, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, రుచి, వాసన పోవటం, గొంతునొప్పి, ముక్కుదిబ్బడ, ముక్కు కారటం, వాంతి, వికారం, విరేచనాల వంటివి కనిపిస్తాయి. తీవ్ర దశలో- ఆయాసం, రక్తంలో ఆక్సిజన్‌ శాతం పడిపోవటం, న్యుమోనియా, ఊపిరితిత్తులు విఫలం కావటం, అవయవాలు దెబ్బతినటం వంటివి తలెత్తుతాయి. 

చికిత్స మారితే ప్రమాదం

జ్వరం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలుంటే ముందుగా అది కొవిడా? డెంగీనా? లేదూ రెండు కలిసి ఉన్నాయా? అనేది కచ్చితంగా నిర్ధారణ చేశాకే చికిత్స ఆరంభించాలి. ఇది చాలా ముఖ్యం. వీటికి చేసే చికిత్సలు వేర్వేరు. డెంగీలో ప్లేట్‌లెట్‌ కణాలు పడిపోయి, రక్తస్రావమయ్యే అవకాశముంది. కొవిడ్‌-19లో రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడే ప్రమాదముంది. అందుకే కొవిడ్‌-! 19లో రక్తం చిక్కబడకుండా. చూసే హెపారిన్‌ వంటి మందులు ఇస్తారు. డెంగీలో రక్తం గడ్డకట్టే తీరు ఎలా ఉందో చూసుకుంటూ ప్లేట్‌లెట్లు బాగా పడిపోతే రక్తనాళం ద్వారా ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. ఇది ఏమాత్రం అటూఇటైనా

ప్రమాదమే. కొవిడ్‌-19 చికిత్సను డెంగీకి ఇస్తే రక్తస్రావమై ప్రాణం మీదికి రావొచ్చు. డెంగీ చికిత్సను కొవిడ్‌-19 బాధితులకు ఇస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరే ప్రమాదముంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి, తగు పరీక్షల ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది.

అసలే కరోనా కాలం. ఆపై జ్వరాల దెబ్బ.ముఖ్యంగా విజృంభిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఎదో ఒక జ్వరంతో బాధపడుతున్నవారే. వీటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటుండటం మరింత గందరగోళానికి తావిస్తోంది. చికిత్సలు వేర్వేరనే విషయం తెలియక కొందరు  నొప్పి మాత్రలనూ  ఆశ్రయిస్తున్నారు. ఇది  మరింత ప్రమాదకరంగానూ పరిణమిస్తోంది.

 

కొవిడ్‌, డెంగీ కలిసి ఉంటే? 

కొవిడ్‌-10, డెంగీ రెండూ కలిసి ఉన్నప్పుడు దేని లక్షణాలు ఉద్ధృతంగా ఉన్నాయో చూసుకోవటం ప్రధానం. నిజానికిది చాలా క్లిష్టమైన పరిస్థితి. ప్లేట్‌లెట్లు తక్కువగా ఉంటే రక్తం గడ్డలను నివారించే (యాంటీకొయాగ్యులేషన్‌) మందులు ఇవ్వకూడదు. ప్లేట్‌లెట్లు మామూలుగా ఉండి, కొవిడ్‌-.19 లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు- తరచూ డీడైమర్‌ పరీక్ష చేస్తూ నిశితంగా గమనించాల్సి ఉంటుంది. డీడైమర్‌. ఎక్కువగా ఉంటే తక్కువసేపు.. అంటే 6-8 గంటల పాటు పనిచేసే ఆన్‌ఫ్రాక్షన్డ్‌ హెపారిన్‌ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ప్లేట్‌లెట్లు పడిపోతున్నట్టు అనిపిస్తే వెంటనే ఆపెయ్యటానికి వీలుంటుంది. దీనికి

విరుగుడు మందూ అందుబాటులో ఉంది. డెంగీ జ్వరంలో ఒంట్లో ద్రవాల మోతాదు తగ్గకుండా చూసుకోవటం కీలకం. ఇందులో రక్తంలోని ష్లాస్మాద్రవం రక్తనాళాల్లోంచి బయటకు వచ్చి పొట్టలో చేరొచ్చు (అసైటిస్‌), ఊపిరితిత్తుల్లో చేరొచ్చు (ప్లూరల్‌ ఎప్యూజన్‌). ఇలా ద్రవం మోతాదు తగ్గటం వల్ల రక్తం చిక్కబడుతుంది. ఫలితంగా రక్తపోటు పడిపోతుంది. ఇలాంటి సమయంలో మామూలు సెలైన్‌ ఎక్కిస్తే చాలు. అదే కొవిడ్‌-19లో అంతగా సెలైన్‌ ఎక్కించాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువ ద్రవాలు ఇస్తే ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదముంది. రక్తం గడ్డకట్టే తీరును తెలిపే పరీక్షలు “రోజూ చేయాల్సి ఉంటుంది. డెంగీలో ఏపీటీటీ, కొవిడ్‌-10లో డీడైమర్‌ పరీక్ష చేస్తారు. వీటి ఫలితాలను బట్టి మందులు ఇవ్వాల్సి ఉంటుంది.

పరీక్షలు అత్యవసరం 

డెంగీ, కొవిడ్‌-19 బాగా తీవ్రమైతే అన్ని అవయవాలూ దెబ్బతినే ప్రమాదముంది. డెంగీలో, మలేరియాలో, లెప్టోస్పైరోసిస్‌లో కామెర్లు తలెత్తే అవకాశముంది. లెష్టోస్పైరోసిస్‌లో తొలిదశలోనే కిడ్నీలు దెబ్బతినొచ్చు. కామెర్లు తలెత్తొచ్చు. మిగతా జబ్బుల్లో మొదట్లోనే కిడ్నీలు ప్రభావితం కావటం తక్కువ. కాబట్టి జ్వరాలకు సరైన చికిత్సను నిర్ణయించటానికి తగు పరీక్షలు చేయటం చాలా ముఖ్యం.

 సంపూర్ణ రక్త పరీక్ష (సీబీపీ): ఇన్‌ఫెక్షన్‌ రకాలను అంచనా వేయటానికిది బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా వైరల్‌ ఇన్‌ ఫెక్టన్లలో తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లు తగ్గుతాయి. కొవిడ్‌-10లో తెల్ల రక్తకణాలు తగ్గుతుంటాయి. ప్లేట్‌లెట్లు అంతగా తగ్గకపోవచ్చు. ప్లేట్‌లెట్లు తగ్గితే డెంగీగా అనుమానించొచ్చు. ఇక స్ర్రబ్‌టైపస్‌, లెప్టోస్పైరోసిస్‌లో తెల్ల రక్తకణాలు పెరుగుతాయి. ప్లేట్‌లెట్లు తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. 

నిర్ధారణ పరీక్షలు

సత్వరం ఫలితాన్ని తెలిపే నిర్ధారణ పరీక్షలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మలేరియాకు ప్యారాసైట్‌ ఎఫ్‌ ఆండ్‌ వీ, డెంగీకి ఎన్‌ఎస్‌1 యాంటీజెన్‌ పరీక్షలు ఉన్నాయి. కొవిడ్‌-19కు సైతం వెంటనే పలితం తెలిపే పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వీటితో తొలి రోజుననే జబ్బులను గుర్తించొచ్చు. ఒకే సమయంలో రెండు, మూడు జబ్బులు కలిసి దాడిచేస్తున్న ప్రస్తుత తరుణంలో నిర్ధారణ పరీక్షలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 

ఇతర ఇన్‌ఫెక్ష న్లూ..

జలుబు: దీనికి మూలం రైనో వైరస్‌ తరగతి వైరస్‌లు. ఇందులో ముక్కు కారటం, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, తుమ్ములు, దగ్గు, కళ్ల వెంట నీరు, ఒళ్లు నొప్పులు, అలసట, బడలిక, కొద్దిగా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

  • వ్లూ జ్వరం: దీనికి కారణం ప్లూ వైరస్‌లు. ఇందులో 101 డిగ్రీల కన్నా ఎక్కువ జ్వరం, ఒళ్లునొప్పులు వేధిస్తాయి. గొంతునొప్పీ ఉండొచ్చు.
  • మలేరియా: దోమలు తెచ్చిపెట్టే మరో సమస్య మలేరియా. ష్లాస్మోడియం జాతి పరాన్నజీవులు దీనికి మూలం. ఇందులో తలనొప్పి, నీరసం, కండరాల నొప్పి, కడుపులో ఇబ్బంది, రోజు విడిచి రోజు జ్వరం, విపరీతమైన చలి వేధిస్తాయి.
  • స్కబ్‌బైఫస్‌: దీనికి మూలం ఓరియెన్షియా షుషుగముషి అనే బ్యాక్టీరియా. ఇది తవిటి పురుగు కుట్టటం ద్వారా వ్యాపిస్తుంది. దీనిలో తలనొప్పి, జ్వరం, చలి, దద్దు వంటివి కనిపిస్తాయి.
  • లెప్టొస్పైరోసిస్‌: ఇది ఎలుకల మూత్రంతో కలుషితమైన ఆహారం, నీటి ద్వారా సంక్రమిస్తుంది. జ్వరం, విపరీతమైన తలనొప్పి, వణుకు, కండరాల నొప్పులు, వాంతులు, కళ్లు ఎర్రబడటం, విరేచనాలు, దద్దుర్లు దీని లక్షణాలు. ఇందులోనూ ప్లేట్‌లెట్లు తగ్గొచ్చు, కామెర్లు తలెత్తొచ్చు, కిడ్నీలు దెబ్బతినొచ్చు. దీంతో ఇది డెంగీ, టైఫాయిడ్‌, కామేర్ల. జబ్బులుగా పొరపడటానికీ దారితీస్తుంది.

 నివారణ మన చేతుల్లోనే

వర్షాకాలంలో వచ్చే జబ్బులకు చాలావరకు నీరు, ఆహారం కలుషితం కావటం… దోమలు కుట్టటం, గాలి ద్వారా ఇన్‌ ఫెక్షన్లు వ్యాపించటమే కారణం. ఇవన్నీ నివారించుకోదగినవే. దోమలు కుట్టకుండా చూసుకుంటే డెంగీ, మలేరియా, చికున్‌గన్యా బారినపడకుండా కాపాడుకోవచ్చు. మాన్కు ధరిస్తే ప్లూ, జలుబు, కొవిడ్‌-.10, ఇతరత్రా శ్వాసకోశ సమస్యలను  నివారించుకోవచ్చు. శుభ్రమైన ఆహారం, నీరు తీసుకుంటే వాంతులు, విరేచనాలు, కామెర్లు, టైఫాయిడ్‌ను అరికట్టాచ్చు. మట్టిలో అడుగు పెట్టినప్పుడు చెప్పులు ధరించటం, నేల మీద వడుకోకుండా చూసుకోవటం ద్వారా ప్రుబ్‌టైఫస్‌ను నివారించుకోవచ్చు.

 

నొప్పి మందులు వద్దు

మనదగ్గర చాలామంది సొంతంగా మందులు కొనుక్కొని వాడుతుంటారు. ఏమాత్రం జ్వరం, ఒళ్లునొప్పులు అనిపించినా నొప్పిని తగ్గించే మందులు  వేసుకుంటుంటారు. ఇది తగదు. డాక్టర్ సలహా లేకుండా నొప్పి మందులు, స్తిరాయిడ్లు, యాంటీబయోటిక్‌ మందులు వాడకూడదు . నొప్పి మందులు రక్తం గడ్డకట్టే ప్రక్రియను అస్తవ్యస్తం చేస్తాయి. రక్తస్రావానికి దారితీస్తాయి. జ్వరం, నొప్పులు తగ్గటానికి పారాసిటమాల్‌ మాత్రలు సరిపోతాయని తెలుసుకోవాలి. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగొచ్చు. అ జ్వరంతో బాధపడుతుంటే ప్రస్తుతం కండరానికిచ్చే ఇంజెక్షన్లు తీసుకోవటం మంచిది కాదు. ఒకవేళ డెంగీ ఉన్నట్టయితే ఇంజెక్షన్‌ ఇచ్చినచోట రక్తం గూడుకట్టే (హెమటోమా) ప్రమాదముంది.

Learn About the Proper Use of Masks for Better Protection

Learn About the Proper Use of Masks for Better Protection

Going out wearing face masks is the new normal during the pandemic and it’s not going to change anytime soon, given our protection. Even if you are partially or fully vaccinated, giving up on masks is not something we recommend as medical experts. Despite two threatening waves of Covid-19 and the third wave entering our borders, some people ignore the proper use of face masks.

So, are you wearing your masks properly? To know, here are some helpful tips and precautions to take care of while wearing masks both indoors and outdoors.

Proper use of masks

Face masks work as a physical barrier against particle droplets and fluids. The effectiveness of surgical and cloth masks can be improved when you ensure it fits well to your face contours preventing any air leakage around its edges.

There should be no gaps between the nose, mouth and chin for the air to pass through. You should be feeling warm air while breathing with a mask on.

When wearing a surgical mask, make sure to keep these points in mind:

  • Choose a suitable size of the mask.
  • Wash your hands properly before putting on the mask.
  • Most surgical masks come with a triple layer design – an outer layer to repel fluid, a middle layer to restrict germs, and the innermost layer to absorb moisture. Make sure the one you use has all three layers for better protection.
  • When using a tie-on surgical mask, tie the upper pair of strings at the crown of your head and the lower ones at your nape.
  • Extend the mask to ensure it covers your nose, mouth, and chin completely.
  • Press the metallic strip of the surgical masks on the nose bridge and ensure it snugs well over your face.
  • Do not touch the mask while it’s on.
  • While removing the tie-on mask, unfasten the ties at the nape before the ones at the crown of your head.
  • Do not touch the outer surface of the mask while taking it off as it may have germs.
  • Discard the used mask in the bin and wash your hands properly.
  • Change your surgical masks frequently. Ideally, it should be discarded after one use.

Note: When using cloth masks, follow the above measures. Although you can reuse the cloth mask, you must wash it well after each use.

Precautions while wearing a mask:

  • Do not put a mask on kids below the age of 2 years
  • People with breathing difficulties shouldn’t wear masks
  • Do not consider face masks as an alternative to social distancing.

Types of masks

Cloth masks

These are made from different kinds of fabrics and are available in various types. You must look for the ones that are made of breathable fabric and firmly woven. It must have a nose wire and should block light when you hold up to bright light.

Do not use cloth masks with exhalation vents or valves. You should refuse single layer masks and the ones made of low-quality fabric.

Note: For better protection, you can wear two masks – one disposable mask underneath the cloth mask.

Disposable masks

Surgical masks or medical masks are used as disposable masks. These are easily available in pharmacies. You must look for one that has multiple layers of non-woven material. Choose one with a nose wire.

Do not use surgical masks having gaps around their edges. Discard the wet and dirty ones immediately.

Labelled masks

Some masks are designed and medically tested to prove their efficiency in performing consistent protection and prevention of the spread of the virus. These masks are labelled to show they meet medical standards.

Look for face masks labelled as KN95, ASTM F3502, and ‘meets workplace performance’, etc. If you have a specific type of facial hair, do not wear labelled masks. Discard them when wet or if it gets difficult to breathe.

Covid Vaccines – How do They Protect Against the Infection?

Covid Vaccines – How do They Protect Against the Infection?

Covid vaccine campaigns are running across the globe and WHO is continuously working endlessly with its partners to manufacture, develop and distribute safe and effective vaccines. Countries have come together to import and export their licensed vaccines, ensuring more and more people get vaccinated by the end of this year.

Though vaccines are a great effective tool in protecting against the life-threatening virus, we must follow the cautionary guidelines of wearing masks, maintaining social distance and ensuring proper ventilation indoors.

In January 2021, India started the covid vaccination drives to control the spread of the virus by ensuring equitable access to the vaccine. The country has two licensed vaccines – Covishield and Covaxin. The government has also got the Sputnik vaccine imported from Russia that is under its Phase III trial.

In this blog, we have discussed the different kinds of vaccines available in India and how these vaccines work in the body.

How do Covid-19 vaccines work?

Before you understand the working process of the covid-19 vaccines, it is essential to learn how your body fights the illness. When the SARS-CoV-2 virus enters your body, it starts multiplying and causes infection.

Your immune system has white blood cells that fight infection in different ways. Macrophages are the type of WBCs that digest germs and dying cells, leaving behind only parts of the invading germs known as ‘antigens’. The body recognizes the antigens as dangerous and creates antibodies for attacking them back.

Another kind of WBCs is B-lymphocytes. These are defensive blood cells that carry out the role of creating antibodies to attack the strains of the virus left behind by the macrophages. T-lymphocytes are again a defensive WBC that is known to attack infected cells in the body.

The Covid-19 vaccines promote immunity development against the virus without being affected by the illness. However, one can still get affected by the virus after vaccination, but the severity of the illness would be very less as compared to a non-vaccinated Covid-positive patient.

Again, different vaccines work differently to ensure protection. However, all of these vaccines leave behind “memory cells” of T-lymphocytes and B-lymphocytes that remembers fighting against the virus in the future.

The body takes a few weeks to create B-lymphocytes and T-lymphocytes. As such, you can get infected by the Covid virus right after or before vaccination because your body didn’t get sufficient time to produce the antibodies.

Post-vaccination, the body shows various symptoms as it builds immunity. The most common symptoms include fever, body aches, headache, etc.

What are the types of vaccines licensed in India?

The Central Drugs Standard Control Organization granted EUA (emergency use authorization) to two vaccines made in India – Covishield and Covaxin. Sputnik –V is another vaccine that was granted EUA in April 2021.

Covishield is a Viral Vector-based technology manufactured by the Serum Institute of India. The time interval between the two doses of this vaccine is 12 to 16 weeks now, which was earlier 4 to 8 weeks.

Covaxin is a whole-virion inactivated coronavirus vaccine manufactured by the Bharat Biotech. The time interval between the two doses of this vaccine is 4 to 6 weeks.

In a Nutshell

We need to understand that the developing vaccines will not bring this pandemic situation to an end, but faster vaccination will. While the government and medical fraternities continue with the vaccination drives across the country, we should keep taking precautions to protect ourselves and the people around us on an individual level.

టీకా తాత్పర్యం తెలుసుకో!

టీకా తాత్పర్యం తెలుసుకో!

Dr. ఎం.వి.రావు
‘కన్పల్డెంట్‌ ఫిజిషియన్‌, యశోదా హాస్పిటల్‌,సోమాజిగూడ, హైదరాబాద్‌ 

అందరూ కోరుకున్నట్టుగానే, అనతికాలంలోనే 18 ఏళ్లు పైబడ్డవారికీ కొవిడ్‌-19 టీకా అందుబాటులోకి వచ్చింది. కరోనా మీద వీలైనంత త్వరగా, సమర్థంగా వ్‌జయం సాధించటంలో ఇది అత్యంత కీలక పరిణామం అనటం నిస్సందేహం.మనదేశంలో యువతీ యువకుల సంఖ్య ఎక్కువ.ఇలాంటి చిన్నవయసువారంతా టీకాలు తీసుకుంటే కరోనా పీచమణచటానికి ఎంతో సమయం పట్టదు. సరైన అవగాహనతో,తగు జాగ్రత్తలతో టీకా తీసుకోవటమే ఇప్పుడందరి కర్తవ్యం కావాలి. కాకపోతే తెలిసో తెలియకో కొందరు కొవిడ్‌-19 టీకా విషయంలో ఇప్పటికీ అనేక రకాలుగా సందేహిస్తుండటం విచారకరం. ఇది తగదు. తప్పుడు ప్రచారాల మూలంగా భయాల్లో మునిగిపోవటం ఎంతమాత్రం మంచిది కాదు.

ఒకవైపు రోజురోజుకీ ఎక్కువవుతున్న కొవిడ్‌-19 కేసులు. మరోవైపు పెరిగిపోతున్న మరణాలు. ఆసుపత్రుల్లో రద్దీ పెరగటం… సదుపాయాలు, చికిత్సలు సత్వరం అందకపోవటం వంటి దృశ్యాలు భయానక పరిస్టితికే అద్దం పడుతున్నాయి. ఇంతటి భీత్రావహ వాతావరణంలోనూ. టీకా ఒక్కటే ఆశాజనకంగా, తిరుగులేని బ్రహ్మాస్తంలా అభయమిస్తోంది. నిజానికి టీకా సైతం, కొవిడ్‌-18 కారక సార్స్‌శోవీ? లాంటిదే కాకపోతే ప్రమాదకరం కాడు. ఎలాంటి హాని చేయకుండానే మనలో రోగనిరోధకశక్తిని ఉత్తేజితం చేస్తుంది. యాంటీబాడీలు పుట్టుకొచ్చేలా చేసి మున్ముందు ఇన్‌పెళ్లన్‌ బారినపడకుండా… ఒకవేళ ఇన్‌ ఫెక్షన్‌ తలెత్తినా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లకుండా కాపాడుతుంది. అయితే ఆరోగ్యవంతుల దగ్గర్నుంచి మధుమేహం, అధికస్తు, అలర్జీల వంటి దీర్ణకాల సమస్యలతో బాధపడేవారి వరకూ అందరి మనసుల్లోనూ. ఒకటే ప్రశ్న టీకా తీసుకోవాలా? వద్దా? తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పటికే మనదగ్గర దాదాపు 16 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. అయినా ఇంకా సందేహాలు ఎందుకు? ఏదైనా అనుమానం ఉంటే నివృత్తి చేసుకొని, ముందుకు సాగటమే తక్షణం చేయాల్సిన పని.

  • నెలనరి నమయంలో టీకా తీనుకోవబ్చా?
    యుక్తవయసు అమ్మాయిలకు టీకా అనగానే నెలసరి సమయంలో తీసుకోవచ్చా? అనే చాలామంది అడుగుతున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో అపోహలూ రాజ్యమేలుతున్నాయి. వీటిల్లొ ప్రధానమైంది నెలసరితో రోగనిరోధకశక్తి మందగిస్తుందని… అందువల్ల నెలసరి రావటానికి ఐదు రోజుల ముందు, నెలసరి అవుతున్నప్పుడు, తర్వాత టీకా ము. ఇందులో ఏమాత్రం నిజరి లేదు. నెలసరి మీద, రుతుస్రావం మీద టీకా ఎలాంటి విపరీత ప్రభావం చూపడు. అంతర్జాతీయ వైద్య సంస్థలన్నీ ఈ విషయాన్నే గట్టిగా “పేర్కొంటున్నాయి. అందువల్ల నేలసరి సమయాన్ని బట్టి టీకా తేదీని మార్చుకోవటం వంటివేవీ చేయొద్చ. నెలసరితో సంబంధం లేకుండా 18 ఏళ్లు దాటిన మహిళలంతా తప్పకుండా టీకా తీసుకోవాలి.
  • గర్భిణులు, పాలిచ్చే తల్లులు తీసుకోవచ్చా?
    మనదగ్గర ప్రస్తుతానికి గర్భిణులకు, పాలిచ్చే తల్నలకు టీకా వద్దనే ప్రభుత్వం సూచిస్తోంది ఒకవేళ తెలియకుండా పొరపాటున తీసుకున్నా ఏమీ  కాదు. భయపడాల్సిన పనేమీ లేదు.
  • కొత్తగా పెళ్లయినవారు తీనుకోవచ్చా?
    గర్భధారణకు ప్రయత్నించేవారు, కొత్తగా పెళ్లయిన యువతులు టీకా తీసుకోవద్దని ప్రభుత్వ ‘మార్గదర్శతాలు పేర్కొంటున్నాయి. టీకా తీసుకున్న సమయంలో గర్బం ధరించినా ఇబ్బందులేవీ
    తలెత్తటం లేదనే అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నప్పటికీ మనదగ్గర దీని విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
  • గర్భనంచి లో తిత్తులుంటే?
    అవివాహిత అమ్మాయిలు, యువతులు నిరభ్యంతరంగా టీకో తీసుకోవచ్చు. పెళ్లయినా కాకున్నా నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువ, తక్కువ అయ్యేవారు… గర్భసంచిలో నీటితిత్తుల వంటి సమస్యలు గలవారు కూడా టీకా తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
  • రక్తహీనత తో బాదవడుతుంటే?
    మనదేశంలో రక్తహీనత ఎక్కువ మూడింట రెండొంతుల మంది మహిళలు దీంతో  బాధపడుతున్నవారే. దీనికి, టీకాకు సంబంధమేమీ లేదు. రక్తహీనత ఉన్నా కూడా టీకా విధిగా తీసుకోవాల.
  • క్యాన్సర్ తో బాధవడుతుంటే?
    క్యాన్సర్‌ బాధితులు, క్యాన్సర్‌ చికిత్స తీసుకునేవారికి రోగనిరోధకశక్తి తక్కువగా. ఉంటుంది. ఇలాంటివారికి కరోనా ముప్పు ఎక్కువ. కాబట్టి మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులతో బాధపడేవారి మాదిరిగానే వీరికీ ముప్పు ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా టీకా తీసుకోవాలి.
  • సంతాన సమన్యలేవైనా వస్తాయా?
    సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న మరో పెద్ద అపోహ ఇది టీకాలోని పదార్దాలు మాయలోని ప్రాటీన్‌కు హాని కలిగిస్తాయని కొందరు వెనకాడుతున్నారు. వీటిల్లో ఎలాంటి నిజమూ లేదు. టీకాల్లో మన శరీరానికి హాని చేసే ‘పదార్దాలేవీ ఉండవని తెలుసుకోవాలి. ఇవి ఎలాంటి సంతాన సమస్యలను కలగజేయవు గర్భిణులు రకరకాల టీకాలు తీసుకోవటం చూస్తున్నదే. వీటితో పుట్టకొచ్చే యాంటీబాడీలు గర్భస్థ శిశువుకూ చేరుకుంటాయి. కాన్సు తర్వాత తల్లిపాల ద్వారా శిశువులకూ అందుతాయి. కొవిడ్‌-19 టీకా విషయంలోనూ ఇలాంటి ఫలితమే కనిపిస్తున్నట్ట అంతర్జాతీయ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి సంతాన సమస్యలపై ఎలాంటి అపోహలు, భయాలు పెట్టుకోవద్దు. అయితే సంతాన చికిత్సలు తీసుకునేవారు. అండాన్ని సేకరించటానికి, గర్భంలో పిండాన్ని ప్రవేశ పెట్టటానికి మూడు రోజుల ముందు, మూడు రోజుల తర్వాత టీకా తీసుకోవటం తగదు. అలాగని టీకా హాని చేస్తుందనీ కాదు. టీకా తీసుకున్నాక జ్వరం వంటి ఇబ్బందులు తలెత్తితే అవి టీకాతోనా? సంతాన చికిత్సల దుష్ప్రభావాలా? అనేవి తెలుసుకోవటం కష్టమవుతుంది కాబట్టే.
  • ఇతరత్రా టీకొలు వేయించుకుంటే?
    ఫ్లూ, న్యుమోనియా వంటి ఇతరత్రా టీకాలు వేయించుకున్నవారు రెండు వారాల తర్వాతే కొవిడ్‌-19 టీకా వేయించుకోవాలి.
  • టీకా కోసం పోతే?
    టీకా కోసం వెళ్లి కొవిడ్‌-10ను వెంట తెచ్చుకోవటం తగదు. టీకా కేంద్రానికి వెళ్లినప్పుడు విధిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.టీకా రెండు మోతాదులు తీసుకున్నాక ? వారాల తర్వాతే వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుంది. అప్పటివరకూ మిగతావారితో సమానంగాన్నే ముప్పు ఉంటుంది. ఇటీవల టీకా కేంద్రాల్లో రద్దీ బాగా పెరిగిపోయింది. దూరం పాటించటం లేదు. టీకా లభిస్తుందో, లేదోననే ఆందోళనలతో ఒకరి మీద మరొకరు పడిపోతున్నారు. ఇది కొవిడ్‌ వ్యాపించటానికి దారితీస్తోంది. మంచి నాణ్యమైన మాస్కులు ధరించాలి. గ్లవుజులు వేసుకోవాలి. ముఖానికి షీల్డ్‌ ధరిస్తే ఇంకా మంచిది. దీంతో కళ్ళు, ముక్క పూర్తిగా కప్పుకొని ఉండేలా చూసుకోవచ్చు. మాటిమాటికి చేత్తో ముఖాన్ని తాకటమూ తగ్గుతుంది.
  • సోరియాసిస్‌ గలవాడు?
    సోరియాసిస్‌ వంటి చర్మ సమస్యలు గలవారు రోగనిరోధకశక్తిని అణచిపెట్టే కొన్నిరకాల మందులు వాడుతుంటారు. ఇలాంటివారు. టకా తీసుకుంటే ‘యాంటీబాడీల ప్రతిస్పందనలు అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. రుమటాయిడ్‌ అర్ధయిటిస్‌, ఎస్‌ఎల్‌ఈ వంటి స్వీయ రోగనిరోధక జబ్బులతో బాధపడేవారు డాక్టర్‌ను సంట్రదించి టీకా తీసుకోవాలి. అవసరమైతే జబ్బు తీవ్రతను బట్టి డాక్టర్లు మందుల మోతాదు.కొంతవరకు తగ్గిస్తారు. దీంతో టీకా సామర్ధ్యం పెరిగేలా చేసుకోవచ్చు. మందుల మోతాదు తగ్గించే అవకాశం లేకపోయినా టీకా తీసుకోవటమే మంచిది. ఎంతోకొంత టీకా రక్షణ లభించే అవకాశం లేకపోలేదు.
  • రెటీనా రక్తనాళంలో గడ్డ ఉంటే?
    ప్రధాన రెటీనా రక్తనాళంలో రక్తం గడ్డ (సెంట్రల్‌ ‘రెటీనల్‌ అర్జరీ అక్తూజన్‌) గలవారు రక్తం గడ్డలు ఏర్పడకుండా చూసే మందులు వేసుకుంటుంటారు. ఇలాంటివారు కొవిషీల్డ్‌కు బదులు కొవార్డిన్‌ టీకా వేసుకోవటం మంచిది. కొవిషేల్డ్‌తో కొందరికి రక్తం గడ్డలు ఏర్పడే అవకాశముంటున్నట్టు బయటపడింది. కాబట్టి డాక్టర్‌ పర్యవేక్షణలో తగు టీకా తీసుకోవాలి.
  • రక్తాన్ని పలుచబరచే మందులేనుకుంటే?
    ప్రస్తుతం ఎంతోమంది చిన్నవయసులోనే రక్తాన్ని పలుచబరచే యాసిన్‌, క్లొపిడెగ్రైల్‌ మందులు వేసుకుంటున్నారు. వీటిని వేసుకుంటున్నా కూడా వయసుతో నిమిత్తం లేకుండా టీకా తీసుకోవచ్చు. కాకపోతే రక్తం గడ్డలు ఏర్పడకుండా చూసే మాత్రలు (యాంటీ కొయాగ్యులెంట్ను) వేసుకునేవారు పీటీఐఎన్‌ఆర్‌ పరీక్ష చేసుకొని, ఫలితాలను బట్టి వేయించుకోవాలి. పీటీఐఎన్‌ఆర్‌ ఎక్కువగా ఉంటే ఇంజెక్షన్‌ ఇచ్చిన చోట రక్తం గూడు కట్టే ప్రమాదముంది.
  • అలర్జీలు, ఆస్థమా బాధితులు తీనుకోవవచ్చా?
    చిన్న చిన్న అలర్జీ సమస్యలకు, ఆస్థమాకు భయపడాల్సిన పనిలేదు. నిరభ్యంతరంగా టీకా తీసుకోవచ్చు. టీకాలో వాడే నిల్వ పదార్దాల వల్ల రియాక్షన్‌ వస్తేనే దాన్ని తీవ్రంగా పరిగణస్తారని తెలుసుకోవాలి. కొందరు ‘నాకు ఈ మందు పడదు, ఆ మందు పడదు’ అని భయపడుతున్నారు. ఇలాంటివారు టీకా కేంద్రంలో సిబ్బందికీ ముందే విషయాన్ని తెలియజేయాలి. అయితే గతంలో స్టీవెన్స్‌ జాన్సన్‌ సిండ్రోమ్‌ వంటి తీవ్ర అలర్జీ తలెత్తినవారు గానీ ఇంతకుముందు ఇతరత్రా టీకాలు వేసుకున్నప్పుడు అలర్జీలు తలెత్తినవారు గానీ టీకాకు దూరంగా ఉండటం మంచిది. స్టీవెన్స్‌ జాన్సన్‌ సిండ్రోమ్‌ గలవారి విషయంలోనూ. టీకా తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనం, వేసుకోకపోతే వచ్చే నష్టం బేరీజు వేసి డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు.

టీకా ప్రాప్తిరస్తు

టీకా ప్రాప్తిరస్తు

Dr. ఎం.వి.రావు
‘కన్పల్డెంట్‌ ఫిజిషియన్‌, యశోదా హాస్పిటల్‌,సోమాజిగూడ, హైదరాబాద్‌ 

అద్భుతం… అద్వితీయం… అసామాన్యం! కొవిడ్‌-19 టీకాను వర్ణించటానికి ఇలాంటి పదాలు ఎన్నయినా సరిపోవు. దశాబ్దాలుగా పీడిస్తున్న ఇన్‌ఫెక్షన్లకే టీకాలు లేని రోజుల్లో ఇంత సత్వరం టీకా అందుబాటులోకి రావటమంటే మాటలా? మున్నెన్నడూ ఎరగని వైరన్‌ పుట్టుకురావటం, శరవేగంగా ప్రపంచాన్ని చుట్టబెట్టటం, అది మానవాళి మొత్తాన్ని దిగ్బంధించటం, దాన్ని మట్టబెట్టటానికి అంతే వేగంగా టీకాను రూపొందించటం… అంతా కేవలం ఏడాది కాలంలోనే జరగటమనేది అనూహ్యం. ప్రయోగాలు, ప్రయోగ పరీక్షలు, అత్యవసర వినియోగ దశలు దాటుకొని కొవిడ్‌-19 టీకా అందరికీ అందుబాటులోకి వచ్చిన శుభ
తరుణంలో మనందరి లక్ష్యం ఒకటే కావాలి. భయాలు, అపోహలు, అవాస్తవాలకు తావివ్వకుండా అందరమూ టీకా ధారులమే కావాలి. మన ఆరోగ్యమే పరమావధిగా అహోరాత్రాలు శ్రమించి, అనతికాలంలో టీకా కలను నిజం చేసిన శాస్త్రవేత్తల కృషికి నిజమైన ప్రయోజనం సిద్ధించేది అప్పుడే.

శరీరాన్ని మించిన టీకా ఫ్యాక్టరీ మరేదీ లేదు. తనను దెబ్బతీయాలని ప్రయత్నించే సూక్ష్మక్రిములను మట్టుబెట్టే సాధన సంపత్తిని సమకూర్చుకోవటం శరీరానికి పుట్టుకతో అబ్బిన విద్య. ఎప్పటికప్పుడు రోగనిరోధకశక్తిని ప్రేరేపించి, యాంటీబాడీలతో దాడికి దిగుతుంది. కొత్త క్రిములు విజృంభించినప్పుడే కాస్త తడబడుతుంటుంది. వాటిపై పైచేయి సాధించటానికి పోరాటం చేస్తున్నప్పటికీ కొన్నిసార్లు చేతులెత్తేస్తుంది. అలాగని పోరాటం ఆపదు. సరిగ్గా ఇక్కడే కొంత దన్ను అవసరం. టీకా అందించేది ఇలాంటి బలమే. కొవిడ్‌-.19ను అంతం చేయటానికి ఇప్పుడిదే వజ్రాయుధం కానుంది. వైరన్‌ వాహకం, నిర్వీర్య వైరన్‌, వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ.. ఇలా ఎలాంటి పరిజ్ఞానంతో తయారైనవైనా అన్ని టీకాలు మన మేలు కోసం పుట్టకొచ్చినవే. సార్స్‌-కోవీ? మాదిరిగానే ఇవీ రోగనిరోధకశక్తిని ప్రేరేపిస్తాయి గానీ జబ్బును కలగజేయవు. కొవిడ్‌-19ను ఎదుర్కోవటానికి అవసరమైన యాంటీబాడీలు ఉత్సత్తయ్యేలా చేస్తాయి. ఎందుకనో గానీ టీకాలనగానే కొందరు తెగ బెంబేలెత్తిపోతుంటారు. తెలిసీ తెలియని వాళ్లు చెప్పినవే నిజమనుకొని లేనిపోని అపోహలు ‘పెంచుకుంటుంటారు. ఇది మంచిది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎంతోమంది కొవిడ్‌-18 టీకాలను తీసుకున్నారు. మనదేశంలోనూ ఆరంభించారు. ఎక్కడా, ఎవరికీ హాని జరగలేదు. కాబట్టి భయపడాల్సిన! పనిలేదు. సందేహాలను నివృత్తి చేసుకొని స్వచ్చందగానే ముందడుగు వేయాలి. ఎవరికివారే టీకా స్తాప్పిరస్తు అని దీవించుకోవాలి. ఇప్పటివరకూ స్తాణాలను అరచేతిలో పెట్టుకొని బతికిన రోజులకు మంగళం పాడాలి.

కొవిడ్‌-18 టీకా అందరూ తీసుకోవాలా?

కరోనా జబ్బు వచ్చినా, రాకున్నా అందరూ టీకా తీసుకోవాల్సిన అవసరముంది. ఇప్పటికే కొవిడ్‌-19 వచ్చినవారిలో సహజంగానే రోగనిరోధకశక్తి పుట్టుకొచ్చి ఉండొచ్చు. ఇది ఎంతకాలం రక్షణ ఇస్తుందనేది కచ్చితంగా తెలియదు. అధ్యయనాల్లో రకరకాల ఫలితాలు వెలువడుతున్నాయి. కొన్ని 4 నెలల వరకు, మరికొన్ని -8 నెలల వరకు రక్షణ ఉంటుందని పేర్కొంటున్నాయి. ఇది మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా నివారిస్తుందా? లేకపోతే జబ్బు తీవ్రం కాకుండా చూస్తుందా? మరణాలను ఆపుతుందా? అనేవీ తెలియవు. కాబట్టి అంతా టీకా తీసుకోవటం మంచిది. టీకా తీసుకుంటే జబ్బు తలెత్తకుండానే కరోనా వైరన్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు పుట్టుకొస్తాయి. కొవిడ్‌-.19 వ్యాపించకుండా, జబ్బు తీవ్రం కాకుండా చూడటంలో సహజ, టీకా రోగనిరోధకశక్తి రెండూ కీలకమే.

టీకా తప్పనిసరా? తీసుకోకపోతే ఏమవుతుంది?

వైరన్‌ జన్యుపరంగా చాలా వేగంగా మార్సు చెందుతోంది. ఇలాంటి తరుణంలో ఎంత త్వరగా టీకా తీసుకుంటే అంత మంచిది. టీకా తీసుకోవటం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడినా తప్పకుండా తీసుకోవటమే ఉత్తమం. మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్‌ వంటి సమస్యలు గలవారికిది మరింత ముఖ్యం. ఎందుకంటే ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి కొవిడ్‌ ముప్పు ఎక్కువ. తొలివిడతలో వైద్య సిబ్బంది… పోలీసులు, రెవెన్యూ, పురపాలక ఉద్యోగులు… ఆ తర్వాత 50 ఏళ్లు పైబడ్డవారికి.. మధుమేహం వంటి దీర్హకాలిక జబ్బులు గలవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మనం ఒక కొత్త వైరన్‌తో పోరాడుతున్నాం. దీంతో తలెత్తే ఇన్‌ఫెక్షన్‌కు కచ్చితమైన, ప్రామాణిక మందులేవీ లేవు. అన్నీ ప్రయోగాత్మకంగా, అనుభవంతో వాడుతున్నవే. అదృష్టం కొద్దీ కరోనా జబ్బులో మరణాల సంఖ్య తక్కువగానే ఉంటున్నప్పటికీ వీటిని సైతం ఆపాలన్నదే మన లక్ష్యం. ఇందుకు టీకా ఎంతగానో ఉపయోగపడుతుంది.

మద్యంతో టీకా దెబ్బతింటుందా?

అతిగా మద్యం తాగితే టీకాతో పుట్టుకొచ్చే రోగనిరోధక ప్రతిస్పందనలు తగ్గిపోవచ్చు. అందుకే రష్యా ప్రభుత్వం టీకా తొలి మోతాదు తీసుకోవటానికి ? రెండు వారాల ముందు నుంచే మద్యం మానెయ్యాలని సూచించింది. అలాగే రెండో మోతాదు తీసుకున్నాక 8 వారాల వరకూ దీని జోలికి వెళ్లొద్దని చెప్పింది.

ముందు కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలా?

అవసరం లేదు. ఒకవేళ జలుబు, దగ్గు, జ్వరం వంటి కొవిడ్‌ అనుమానిత లక్షణాలుంటే మాత్రం పరీక్ష చేయించుకోవాలి. ఫలితం నెగెటివ్‌గా వచ్చినప్పటికీ లక్షణాలు తగ్గాకే టీకా తీసుకోవాలి.

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు తీసుకోవచ్చా?

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ గలవారు, కొవిడ్‌ అనుమానిత లక్షణాలు గలవారు టీకా తీసుకోవటం వాయిదా వేసుకోవాలి. ఇన్‌ఫెక్షన్‌ నుంచి పూర్తిగా కోలుకున్నాక 4-8 వారాల తర్వాతే టీకా తీసుకోవాలి. కొవిడ్‌కు మోనోక్షోనల్‌ యాంటీబాడీలు లేదా ష్షాస్మా చికిత్స తీసుకున్నవారికి, ఇతరత్తా ఏవైనా జబ్బులు తీవ్రమై ఆసుపత్రిలో చేరినవారికీ ఇదే వర్తిస్తుంది.

ఎన్ని మోతాదులు తీసుకోవాలి?

తం అందుబాటులో ఉన్న టీకాలను రెండు మోతాదుల్లో తీసుకోవాలి. ఒకటి తీసుకున్నాక 28 రోజులకు మరో మోతాదు తీసుకోవాలి. నిర్వీర్య వైరస్‌, బలహీన పరచిన వైరన్‌ భాగాలతో రూపొందించిన ఇవి సమర్థంగా పనిచేయాలంటే రెండు మోతాదులూ తీసుకోవాలి.

ఒక్కటే తీసుకుంటే ఏమవుతుంది?

ఒక మోతాదుతో 60-80% వరకు రక్షణ లభించొచ్చు. అదీ ఎక్కువ కాలం కొనసాగదు. అందువల్ల సంపూర్ణ రక్షణ లభించాలంటే రెండు మోతాదులు తప్పకుండా తీసుకోవాలి.

రెండోది తీసుకోవటం మరచిపోతే?

గాబరా పడాల్సిన పనిలేదు. వీలైనంత త్వరగా రెండో మోతాదు తీసుకోవాలి. మొదటి మోతాదు టీకాను మళ్లీ తీసుకోవాల్సిన అవసరం లేదు.

మందులపై ప్రభావముంటుందా?

మందుల మీద టీకా విపరీత ప్రభావమేమీ ఉండదు. కాకపోతే రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు, స్టిరాయిడ్డు వాడుతున్నవారిలో యాంటీబాడీలు అంతగా ఉత్సత్తి కాకపోవచ్చు.

అవయవ మార్చిడి చేయించుకున్నవారు తీసుకోవచ్చా?

అవయవ మార్సిడి చేయించుకున్నవారు రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు వాడుతుంటారు. కాబట్టి ప్రస్తుతానికి కరోనా టీకాను వీరికి సిఫారసు చేయటం లేదు. మున్ముందు అవసరమైతే నిపుణుల సలహా మేరకు, అదీ వైద్యుల పర్యవేక్షణలోనే ఇచ్చే అవకాశముంది.

వైరన్‌ మారినప్పుడల్లా మరో టీకా తీసుకోవాలా?

కరోనా వైరన్‌ అప్పుడప్పుడు జన్యుపరంగా మార్పులు చెందుతుండొచ్చు గానీ ఇది ఫ్లూ వైరన్‌ మాదిరిగా ‘మారుతున్నట్ట ఇప్పటివరకూ బయటపడలేదు. పైగా ఇలాంటి విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొనే టీకాలను రూపొందించారు. కరోనా వైరన్‌ మారినా టీకాలు పనిచేస్తాయి. బ్రిటన్‌లో బయటపడ్డ కొత్తరకం వైరన్‌ మీదా టీకాలు పనిచేస్తున్నట్ట వెల్లడైంది.

గర్భిణులు, పాలిచ్చే తల్లులు తీసుకోవచ్చా?

టీకా తయారీ సంస్థలు గర్భిణులపై ఇంకా ప్రయోగ పరీక్షలు చేయలేదు. వీరిపై టీకా ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు. అందుకే గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు కరోనా టీకా ఇవ్వద్దనే అమెరికా నీడీనీ చెబుతోంది. టీకా తీసుకున్నాక రెండు నెలల వరకు గర్భం ధరించొద్దని బ్రిటన్‌ ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలేవీ సజీవ వైరన్‌తో రూపొందించినవి కావు. కాబట్టి ఒకవేళ పొరపాటున తీసుకున్నా ఇబ్బంది ఉండకపోవచ్చు.

మధుమేహంతో బాధపడేవారు తీసుకోవచ్చా?

తీసుకోవచ్చు. నిజానికి మధుమేహం గలవారికి కరోనా వచ్చే అవకాశమే కాదు.. జబ్బు తీవ్రమయ్యే ముప్పు కూడా ఎక్కువే. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు తొలిదశలోనే టీకా తీసుకోవటం ఉత్తమం.

అన్ని టీకాల మోతాదులు సమానమేనా?

చాలావరకు సమానమే. అయితే వేర్వేరు వాహక వైరన్‌లతో రూపొందించిన స్ఫుత్నిక్‌-వి టీకా మోతాదులు వేరుగా ఉంటాయి. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రోజెనికా టీకాను మున్ముందు తొలిసారి సగం మోతాదులోనే ఇవ్వచ్చు.

పిల్లలకూ టీకా ఇప్పించాలా?

కరోనా టీకా ప్రయోగ పరీక్షలు 18 ఏళ్లు పైబడినవారికే నిర్వహించారు. అందువల్ల ప్రస్తుతానికి 18 ఏళ్లలోపు వారికి టీకాలు ఇవ్వకూడదనే నిర్ణయించారు. ఇటీవలే 12 ఏళ్లలోపు పిల్లలపై ప్రయోగ పరీక్షలు ఆరంభమయ్యాయి. వీటి ఫలితాలు వెలువడిన తర్వాతే పిల్లలకు, శిశువులకు టీకా అవసరమా? ఇస్తే ఎంత మోతాదులో ఇవ్వాలి? అనేది తేలుతుంది.

ఏ రకం టీకా తీసుకోవాలి?

అన్ని టీకాలు దాదాపు ఒకే సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాయి. అందువల్ల అందుబాటులో ఉన్న టీకా ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మనదేశంలో తయారైన టీకాలు మరింత అనువైనవని చెప్పుకోవచ్చు. వీటిని 2-8 డిగ్రీల సెల్షియన్‌ ఉష్ణోగ్రతలో భద్రపరిస్తే సరిపోతుంది. పైగా చవక. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలనైతే అతి శీతలమైన.., -0 డిగ్రీల సెల్షియన్‌ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇది మనదేశంలో కష్టం. ప్రస్తుతానికి ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు మనకు అందుబాటులోకి రాలేదు. మున్ముందు రావొచ్చు.

టీకా తీసుకున్నాక ఎన్నిరోజులకు రక్షణ లభిస్తుంది?

సాధారణంగా రెండో మోతాదు టీకా తీసుకున్న ? వారాల తర్వాత అత్యుత్తమ రక్షణ మొదలవుతుంది. జబ్బు తీవ్రం కావటం ‘0-800% వరకు తగ్గుతుంది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం నూటికి నూరు శాతం తగ్గుతుంది. టీకా తక్షణ లక్ష్యం కూడా ఆసుపత్రిలో చేరటాన్ని మరణాలను నివారించటమే.

టీకా తీసుకుంటే మాస్కుతో పనిలేదా?

టీకా తీసుకున్న 2 వారాల తర్వాత యాంటీబాడీలు ఉత్సత్తి కావటం మొదలవుతుంది. అప్పటివరకూ మిగతావాళ్లతో సమానమేనని తెలుసుకోవాలి. పైగా టీకా నూటికి నూరు శాతం రక్షణ ఇవ్వలేదు. ఆయా టీకాల సామర్భ్యాలు వేర్వేరుగా ఉంటున్నాయి. కొన్ని 90%, కొన్ని 85%, కొన్ని 80% రక్షణ ఇస్తున్నట్టు తేలింది. అంటే నూటికి 5-20% మందిలో టీకాలు పనిచేయటం లేదనే అర్థం. వీరికి మిగతా వాళ్ల మాదిరిగానే వైరన్‌ సోకే ముప్పు పొంచి ఉంటుంది. టీకా రక్షణ మొదలైనవారిలోనూ అది వారికి ఇన్‌ఫెక్షన్‌ కలగజేయకపోవచ్చు గానీ వారి నుంచి ఇతరులకు వైరన్‌ వ్యాపించకూడదనేమీ లేదు. కాబట్టి మాస్కు ధరించటం, ఇతరులకు దూరంగా ఉండటం, సబ్బుతో చేతులు కడుక్కోవటం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. ఎక్కువమందికి టీకాలు ఇచ్చేంతవరకు, సామూహిక రోగనిరోధకశక్తి సంతరించుకునేంతవరకు ఇలాంటి జాగ్రత్తలను ఎప్పటిలా పాటించాల్సిందే.

‘దుష్త్రుభావాలేవైనా ఉంటాయా?

ప్రయోగ పరీక్షల్లో పాల్గొన్న చాలామందిలో జ్వరం, నిస్సత్తువ వంటి కొవిడ్‌ లక్షణాలే కనిపించాయి. ఎందుకంటే టీకా కూడా నిజం కరోనా వైరన్‌ మాదిరిగానే లక్షణాలను ప్రేరేపిస్తుంది. ఇది టీకా ప్రభావం చూపుతోందనటానికి నిదర్శనమే. టీకా ఇచ్చిన చోట నొప్పి, బొప్పి వంటివీ కనిపించాయి. కొందరిలో వెన్నుపాము పొర వాపు, ముఖ పక్షవాతం తలెత్తినట్టు వినిపించింది గానీ అవేవీ టీకాకు సంబంధించినవి కావని తేలింది. కరోనా టీకాను అతి తక్కువ సమయంలో రూపొందించిన మాట నిజమే అయినా పరీక్ష పద్ధతులు, విధి విధానాల్లో ఎక్కడా రాజీ పడలేదనే సంగతిని గుర్తించాలి. గత దశాబ్దకాలంగా శాస్త్రరంగం ప్రసాదించిన అధునాతన పరిజ్ఞానాలే సత్వర టీకా రూపకల్పనకు పునాది వేశాయని తెలుసుకోవాలి. టీకా కూడా మందులాంటిదే కాబట్టి దీంతో కొందరికి అలర్జీ రావొచ్చు. ఇది వైరన్‌, వైరన్‌ భాగాలతో తలెత్తుందని అనుకోవటానికీ లేదు. టీకా చెడిపోకుండా ఉండటానికి వాడే పదార్థాలూ కొన్నిసార్లు అలర్జీ తెచ్చి పెట్టొచ్చు. ఏవైనా దుష్ప్రభావాలు తలెత్తితే వెంటనే చికిత్స చేయటానికి అవసరమైన సదుపాయాలన్నీ అందుబాటులో ఉంచుకునే టీకా వేస్తారు. అందుకే టీకా తీసుకున్న తర్వాత కనీసం అరగంట సేపు అక్కడే ఉండాలి. ఏవైనా మందులు పడనివారు… అలర్జీలు, రక్తం గడ్డకట్టటంలో లోపాల
వంటి సమస్యలు గలవారు ముందుగానే ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.

టీకా రక్షణ ఎంతకాలం?

కొత్త కరోనా వైరస్‌ను మనం ఇంతకుముందెన్నడూ ఎదుర్కోలేదు. టీకా తయారీ పరిజ్ఞానమూ కొత్తదే. అందువల్ల ఎంతకాలం రక్షణ లభిస్తుందన్నది ఇప్పుడే చెప్పలేం. టీకా తయారీ సంస్థలు ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు రక్షణ కల్సిస్తాయని చెబుతున్నాయి. టీకా తీసుకున్నవారిని క్రమం తప్పకుండా పరిశీలించిన తర్వాతే ఎంతకాలం వరకు యాంటీబాడీలు ఉంటున్నాయన్నది బయటపడుతుంది. బూస్టర్‌ టీకాలు అవసరమా? అయితే ఎప్పుడు ఇవ్వాలి? అనేది నిర్ణయించటం సాధ్యమవుతుంది.